- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Silver: వెండిలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న మార్గాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!
Silver: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Silver: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లక్ష రూపాయల సమీపానికి చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి చూస్తే బంగారం భారీగా పెరిగింది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించి ఇందులో పెద్దెత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే బంగారంతోపాటు మరో లోహం కూడా విపరీతంగా పెరుగుతోంది. భవిష్యత్తులో బంగారం కన్నా కూడా ఎక్కువ స్పీడుతో పెరిగే లోహం వెండి అని నిపుణులు చెబుతున్నారు.
బంగారంతో పోల్చి చూసినట్లయితే వెండి ధర తక్కువగా ఉన్నప్పటికీ దీని పరిశ్రమలో కూడా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వెండిని ఇండస్ట్రీయల్ ప్లస్ ఇన్వెస్ట్ మెంట్ రెండు లాభాలు కలిగి ఉన్న లోహంగా పేరు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ పెద్దెత్తున పెరిగింది. ఈ నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండిని విరివిగా ఉపయోగిస్తుంటారు. పెరుగుతున్న ఈ డిమాండ్ కారణంగా వెండికి మంచి ధర లభిస్తుంది. వాల్యూషన్ పరంగా చూస్తే వెండి బంగారం కన్నా తక్కువ ధర ఉన్నా సుదీర్ఘకాలం పెట్టుబడి పెట్టే వారికి వెండి మంచి లాభాలను అందించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఫిజికల్ రూపంలో వెండి కొనుగోలు చేయాలంటే వెండి కాయిన్స్ లేదా బార్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని తిరిగి మళ్లీ విక్రయించి నగదుగా చేసుకోవడం చాలా కష్టతరమైనపని. లేదంటే వెండి సామాన్యల రూపంలో కొనుగోలు చేసుకోవాలి. వెండి సామాన్లు ముఖ్యంగా వెండి పళ్ళాలు, వెండి చెంబులు ఆభరణాల రూపంలో వెండిని కొనుగోలు చేయాలి. అయితే వీటిని మేకింగ్ ఛార్జీలు అధనంగా ఉంటాయి. వీటితోపాటు వీటిని విక్రయించి మళ్లీ డబ్బుగా మార్చుకోవడం అనేది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే మార్కెట్ ధరకు తగ్గట్లుగా మీకు ధర లభించకపోవచ్చు.
స్టాక్ మార్కెట్లో కూడా మీరు వెండిపై పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఎక్స్చేంజ్ ట్రేటేడ్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్స్ అంటారు. ఉదాహరణకు నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ వంటి ఫండ్స్ లో మీరు ఏక మొత్తంలో కూడా నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఎంసీఎక్స్ ద్వారా సిల్వర్ భవిష్యత్తులో ట్రేడింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కాస్త రిస్క్ ఎక్కువనే చెప్పాలి. అయితే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.






