- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Housing Prices: 2026లో పెరగనున్న ఇళ్ల ధరలు
మూడింట రెండు వంతుల డెవలపర్లు వచ్చే ఏడాది ఇళ్ల డిమాండ్ 5 శాతం, ధరలు 10 శాతం మేర ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది ఇళ్ల ధరలు మోస్తరుగా పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రముఖ రియల్టర్ల అపెక్స్ బాడీ క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలోని పలు నివాస రియల్ ఎస్టేట్ వర్గాలు 2026లో ధరలతో పాటు డిమాండ్ కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నాయి. దాదాపు మూడింట రెండు వంతుల డెవలపర్లు వచ్చే ఏడాది ఇళ్ల డిమాండ్ 5 శాతం పెరుగుతుందని చెబుతుండగా, ఇదే సమయంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉన్న నివాస మార్కెట్లో ఇప్పుడిప్పుడే కదలిక కనిపిస్తోందని, వినియోగదారులకు మళ్లీ నివాస మార్కెట్‌పై కొత్త విశ్వాసం పెరుగుతున్న సంకేతాలు చూస్తున్నామని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ధరలు పెరిగేందుకు ఇళ్ల కొనుగోలుకు డిమాండ్ బలంగా ఉండటం, సరఫరాలో అంతరం, నిర్మాణంలో పెరుగుతున్న సాంకేతికత, మెరుగైన నిర్మాణం, బ్రాండ్ పేరు, డెవలపర్ విశ్వసనీయత వంటి అంశాలు ధరల పెరుగుదలకు దోహదపడతాయి. వినియోగదారుల్లో పెరుగుతున్న విశ్వాసం, కొనుగోళ్లకు వెనకాడకపోవడం వంటివి కూడా ఈ డిమాండ్‌కు కారణమని కొందరు డెవలపర్లు పేర్కోంటున్నారు.






