Honda India: భారత్‌లో తొలి ఈవీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న హోండా

by S Gopi |

ప్రస్తుతం కంపెనీకి చెందిన నరసపురలోని ప్లాంటులో 24 లక్షల టూ-వీలర్లను తయారు చేస్తోంది.

Honda India: భారత్‌లో తొలి ఈవీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న హోండా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న నరసపుర కంపెనీ ప్లాంటు పక్కనే రూ. 600 కోట్ల పెట్టుబడితో ఈవీ ఉత్పత్తి ప్లాంటును త్వరలో ప్రారంభిస్తామని కంపెనీ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీకి చెందిన నరసపురలోని ప్లాంటులో 24 లక్షల టూ-వీలర్లను తయారు చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నోరియా కైహరా చెప్పారు. కొత్త ఈవీ తయారీ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే వాహనాలు దేశీయ మార్కెట్‌తో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం హోండా కంపెనీ దేశీయంగా యాక్టివా-ఈ, క్యూసీ1 వంటి రెండు ఈవీ స్కూటర్లను విక్రయిస్తోంది.

Next Story