- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Honda Car India: రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన హోండా కార్స్
కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కొత్త జనరేషన్ మోడల్‌పై రూ. 57 వేల వరకు తగ్గింపు ఇవ్వనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్ ఇండియా భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాల స్కీమ్ కింద కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని సిటీ, ఎలివేట్, అమెజ్ లాంటి మోడళ్లపై పెద్ద ఎత్తున రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది. పరిమిత కాలానికి వర్తించే ఈ ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లు ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది. హోండా కార్ ఇండియా అధికారిక వివరాల ప్రకారం, కంపెనీకి చెందిన కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కొత్త జనరేషన్ మోడల్ భారత్ ఎన్‌క్యాప్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన నేపథ్యంలో భారీ డిమాండ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ మోడల్‌పై రూ. 57 వేల వరకు తగ్గింపు ఇవ్వనుంది. దీంతో ఈ కారు ప్రారంభ ధర రూ. 7,47,790 నుంచే లభిస్తుందని తెలిపింది. ఈ కారులో అధునాతన డిజైన్, ఫీచర్లు ఉన్నాయి. లెవెల్ 2 అడాస్ (హోండా సెన్సింగ్), 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈ సెగ్మెంట్‌లోనే అత్యధిక బూట్ స్పేస్ 416-లీటర్లతో వస్తుందని వివరించింది.
కంపెనీ ఎస్‌యూవీ మోడల్ ఎలివేట్‌పై కూడా ఏకంగా రూ. 1.48 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఈ కారు ప్రారంభ ధర రూ. 11,59,890 నుంచి అందుబాటులో ఉంది. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా ఎలివేట్ మోడల్ 220ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ప్రీమియం సెడాన్ సిటీ మోడల్ కారుపైనా కంపెనీ రూ. 1,27,700 వరకు ప్రయోజనాలు కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ కారు రూ. 11,95,300 ప్రారంభ ధరతో లభిస్తుంది.
హైబ్రిడ్ మోడల్ హోండా సిటీ ఈ:హెచ్‌వీపై కంపెనీ 1.97 లక్షల తగ్గింపు ప్రయోజనాలు అందించడంతో ఈ కారు ప్రారంభ ధర ఇప్పుడు రూ. 19.99 లక్షలకు తగ్గింది. ఇక, సబ్-కాంపాక్ట్ సెడాన్ మోడల్ సెకెండ్ జెనరేషన్ అమేజ్‌పై కూడా కంపెనీ రూ. 68 వేల వరకు ప్రయోజనాలు ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ కారు ప్రారంభ ధర రూ. 6,97,700తో కొనుగోలు చేయవచ్చని హోండా కార్ ఇండియా వెల్లడించింది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. కారు వేరియంట్‌ని బట్టి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది.






