రూ.30 వేల కంటే ఆదాయం త‌క్కువ ఉంటే హోం లోన్ తీసుకోవ‌చ్చా..రూల్స్ ఇవే !

by velandi.Saikiran |

తక్కువ ఉంటే హోమ్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇక హోమ్ లోన్ తీసుకునేటప్పుడు..

రూ.30 వేల కంటే ఆదాయం త‌క్కువ ఉంటే హోం లోన్ తీసుకోవ‌చ్చా..రూల్స్ ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇల్లు సొంతది ఉంటే ఆ ఫీలింగ్ వేరే లాగా ఉంటుంది. అందుకే చాలామంది సొంతింటిని కట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. దీనికోసం అప్పులు తీసుకురావడం కూడా జరుగుతుంది. కొంతమంది చాలా తెలివిగా హోమ్ లోన్ తీసుకుని, ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే హోమ్ లోన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. బ్యాంకు రూల్స్ ప్రకారం లోన్ ఇచ్చేటప్పుడు రుణం తీసుకునే వ్యక్తి ఆదాయ పరిమితులు కచ్చితంగా గమనిస్తారు. అతనికి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు అవుతోంది.. తీసుకున్న లోన్ కడతాడా? లేదా? అనే విషయాలను కచ్చితంగా బ్యాంకు గమనిస్తుంది. ఇందులో తేడాలు వస్తే హోమ్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.

ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ కచ్చితంగా చూస్తుంది బ్యాంకు. క్రెడిట్ స్కోర్ లేకపోతే ఎలాంటి లోన్ అప్రూవల్ కాదు. కచ్చితంగా 750 కి పైగా క్రెడిట్ స్కోర్ ఉండాలని చెబుతారు. గతంలో క్రెడిట్ కార్డ్స్ అలాగే చిన్న తరహా లోన్స్ తీసుకున్నారా? వాటిని సరిగ్గా కడుతున్నారా? లేదా ? అందులో ఏమైనా ఎగవేత ఉంటే హోమ్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి తీసుకున్న లోన్‌ రూపాయి అయినా కూడా చెల్లించాల్సిందే. హోమ్ లోన్ తీసుకునే వారి నెలసరి ఆదాయం 30 వేలకు పైగా ఉండాలని బ్యాంకు నిపుణులు చెబుతున్నారు.

అంతకంటే తక్కువ ఉంటే హోమ్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇక హోమ్ లోన్ తీసుకునేటప్పుడు.. మనకు ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ? అనే వివరాలను చూపించాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు, తరచూ కంపెనీలను మార్చితే.. బ్యాంకు లోన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. హోమ్ లోన్ అప్లై చేసుకున్న వాళ్లు కచ్చితంగా సరైన వివరాలు బ్యాంకు వాళ్లకు ఇవ్వాలి. వ్యక్తిగత వివరాలు, ఇంటి అడ్రస్, కుటుంబ వివరాలలో ఎలాంటి తప్పిదాలు చేయకుండా స‌రైన‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే, బ్యాంకు లోన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునే వారి ప్రాపర్టీ వ్యాల్యూ ఎక్కువగా ఉండాలి. ఆ ప్రాపర్టీ వ్యాల్యూ తక్కువ ఉంటే లోన్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.

Next Story