Housing prices: రెట్టింపు పెరగనున్న ఇళ్ల ధరలు

by S Gopi |   (  Updated:2025-09-12 16:36:21  IST  )

జీవనోపాధి, కుటుంబ అవసరాల కోసం నగరాలకు దగ్గరగా ఉండటానికి ఎక్కువమంది అద్దెకు ఉండటానికే మొగ్గుచూపుతున్నారు.

Housing prices: రెట్టింపు పెరగనున్న ఇళ్ల ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇళ్ల ధరలు ఊహించిన దానికంటే వేగంగా పెరగనున్నాయి. ఈ ఏడాది 6.3 శాతం పెరుగుతాయని, 2026లో 7 శాతం పెరుగుతాయని అంచనా స్థిరాస్తి రంగ నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ఇళ్ల ధరలు 4 శాతంతో పోలిస్తే ఈసారి రెట్టింపు పెరగనున్నాయని అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను కొనలేని వారు, జీవనోపాధి, కుటుంబ అవసరాల కోసం నగరాలకు దగ్గరగా ఉండటానికి ఎక్కువమంది అద్దెకు ఉండటానికే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు తోడు సరసమైన ఇళ్ల సరఫరా క్షీణించడం వల్ల చాలామంది అద్దె ఇళ్లలోనే ఉండాలని భావిస్తున్నారని రాయిటర్స్ సర్వేలో తేలింది. కొన్ని నగరాల్లో బాగా జీతం వచ్చే ఉద్యోగాలు ఉండటం, తక్కువ జీతాల వల్ల పని కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లే లక్షలాది మందికి సొంత ఇళ్లకు దూరంగా ఉన్నారు. దీనివల్ల చాలా మంది కొనుగోలుదారులు అద్దెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబోయే సంవత్సరాల్లో పట్టణ ప్రాంతాల్లో అద్దెలు కూడా సగటున 5-8 శాతం వరకు పెరుగుతాయని అంచనా.

Next Story