- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Interest Rate: తగ్గనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఈఎంఐలు
సవరించిన రేట్లు సోమవారం(మే 12) నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వినియోగదారులకు శుభావార్త ప్రకటించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫుండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను కాలవ్యవధులను బట్టి 5-10 శాతం మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించాయి. సవరించిన రేట్లు సోమవారం(మే 12) నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశాయి. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది. ఎందుకంటే బ్యాంకులు ఆయా రుణాలపై వడ్డీ రేట్లను ఎంసీఎల్ఆర్ ఆధారంగానే నిర్ణయిస్తాయి. ముఖ్యంగా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు వల్ల దీర్ఘకాలానికి తీసుకున్న రుణాలపై ఎక్కువ ఉపశమనం లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వడ్డీ రేట్లు 9 శాతం నుంచి 8.95 శాతానికి దిగొచ్చాయి. కెనరా బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 9.10 శాతం నుంచి 9 శాతానికి తగ్గించారు.






