- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి Activa125!

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన సరికొత్త యాక్టివా 125 వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో వచ్చిన యాక్టివా 125 ధరను రూ. 78,920(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ) గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. యాక్టివా 2023 ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చింది.
సౌకర్యవంతమైన, ఇబ్బందుల్లేని రైడింగ్ అనుభూతిని కొత్త స్కూటర్ అందిస్తుందని, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అట్సుషి ఒగాటా చెప్పారు.
వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రెండేళ్ల క్రితం బీఎస్6 ప్రమాణాలను ప్రభుత్వం అమలుచేసింది. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి బీఎస్6 రెండో దశ నిబంధనలు అమలు కానున్నాయి. వాటికి అనుగుణంగా కంపెనీలు బీఎస్6 నిబంధనలు పాటిస్తూ వాహనాలను తీసుకొస్తున్నాయి.
Also Read...