- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hero Vida V2: విడా వీ2 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన హీరో.. ధరల వివరాలివే..!
దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) విడా వీ2 సిరీస్(Vida V2 Series)లో కొత్తగా మూడు ఈవీ స్కూటర్ల(EV Scooters)ను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) విడా వీ2 సిరీస్(Vida V2 Series)లో కొత్తగా మూడు ఈవీ స్కూటర్ల(EV Scooters)ను విడుదల చేసింది. వీ2 లైట్, వీ2 ప్లస్, వీ2 ప్రో పేరుతో వీటిని ఇండియన్ మార్కెట్(Indian Market)లో లాంచ్ చేసింది. దీన్ని వీ1 ఇ-స్కూటర్(V1 e-scooter) అప్ గ్రేడ్ వెర్షన్(Upgraded version)గా తీసుకొచ్చారు. వీ2 లైట్ ధరను రూ. 96,000గా, వీ2 ప్లస్ ధర రూ. 1,15,000గా, వీ2 ప్రో ధరను 1,35,000(Ex-Showroom Delhi) కంపెనీ నిర్ణయించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. వీ2 లైట్ 2.2 కిలో వాట్ల బ్యాటరీని యూజ్ చేశారు. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 94 కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేయగలదు. దీని గరిష్ట వేగం 69 కిలోమీటర్లు. ఇక వీ2 ప్లస్ స్కూటర్ 3.44 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్ తో 143 కిలో మీటర్ల దూరం వెళ్తుంది. మరోవైపు వీ2 ప్రోలో 3.94 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 165 కిలో మీటర్ల వరకు వెళ్లగలదు. అలాగే విడా వీ2 సిరీస్ లో క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.






