Hero Motocorp: 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' మోడల్ ప్రారంభించిన హీరో మోటోకార్ప్

by S Gopi |

ఈ విధానంలో ఈవీలను కొనే కస్టమర్లు వాహనానికి, బ్యాటరీకి విడివిడిగా కొనుగోలు చేసే వీలును కల్పిస్తుంది.

Hero Motocorp: బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్ ప్రారంభించిన హీరో మోటోకార్ప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. తన ఈవీ స్కూటర్ విదా వీఎక్స్2 మోడల్‌కు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(బాస్) సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి దీన్ని ప్రారంభిస్తామని కంపెనీ బుధవారం ప్రకటనలో వెల్లడించింది. దీనివల్ల ఈవీలు మరింత సౌకర్యవంతంగా, ఎక్కువమందికి చేరువ అవుతుందని కంపెనీ ఆశిస్తొంది. ఈ విధానంలో ఈవీలను కొనే కస్టమర్లు వాహనానికి, బ్యాటరీకి విడివిడిగా కొనుగోలు చేసే వీలును కల్పిస్తుంది. ఈవీ బండి కొనే సమయంలో కస్టమర్లకు ఖర్చు తగ్గుతుంది. కంపెనీ తీసుకొచ్చిన విధానంలో రోజువారీ లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌లను ఆధారంగా ఎంచుకోవచ్చు. ఆర్థిక వెసులుబాటు, స్థోమత, సౌలభ్యాన్ని అందించడం ద్వారా ఎక్కువమంది ఈవీలను కొనేందుకు ఇష్టపడతారని కంపెనీ అంచనా వేస్తోంది.

కొత్త బాస్ మోడల్ విదా బ్రాండ్ కింద విస్తృతమైన, భవిష్యత్తులో ఈవీ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తుందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎక్కువ మందికి చేరువ చేయడం, దేశవ్యాప్తంగా ఈవీలకు ఆదరణ కల్పించే లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా హీరో మోటోకార్ప్ కస్టమర్లు వేగంగా పెరుగూన్న ఈవీ మౌలిక సదుపాయాల ప్రయోజనాలు కూడా పొందుతారు. ప్రస్తుతం 100కు పైగా నగరాల్లో 3,600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, 500కి పైగా సర్వీస్ పాయింట్లలో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జూలై నాటికి వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.

Next Story