Term Insurance: ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి మస్ట్... గోల్డెన్ ఫ్యూచర్ కోసం ఇలా చేయండి

by Vennela |

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు చాలా ముఖ్యం.

Term Insurance:  ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి మస్ట్... గోల్డెన్ ఫ్యూచర్ కోసం ఇలా చేయండి
X

దిశ, వెబ్ డెస్క్: Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఒక తప్పుడు నిర్ణయం కుటుంబానికి భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది. అందువల్ల సరైన ఇన్సూరెన్స్ కవర్ ను ఎంచుకోవడం, పేమెంట్ ప్లాన్ ను అర్థం చేసుకోవడం, రైడర్లను పొందడం, ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు చాలా అవసరం. టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance)ద్వారా తక్కువ ప్రీమియంలో కుటుంబ ఆర్థిక భవిష్యత్తును భద్రపరిచే ఛాన్స్ ఉంది. కానీ చాలా మంది భవిష్యత్తులో క్లెయిమ్ చేసే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు (Term Insurance)నిబంధనలు, షరతులను చూపించి గందరగోళానికి గురిచేస్తుంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) తీసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) తీసుకునేటప్పుడు ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలనేది సరియైన నిర్ణయం తీసుకోరు. సాధారణంగా మీ వార్షిక ఆదాయాన్ని 20రెట్లు ఎక్కువగా టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance)కవర్ తీసుకోవాలని సూచన. కానీ చాలా మంది వారి కుటుంబ భవిష్యత్తు అవసరాలు, లోన్, దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక, బాధ్యతలను పరిగణలోనికి తీసుకోకుండా తప్పుగా నిర్ణయిస్తుంటారు. దీని ఫలితంగా కుటుంబ భవిష్యత్తులో ఆర్థిక నష్టాలను ఎదుర్కొవల్సి వస్తుంది.

పేమెంట్ ఆప్షన్ అంటే ఇన్సూరెన్స్(Term Insurance) కంపెనీ ఇన్సూర్డ్ వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబానికి బంగారం ఇచ్చే విధానం. ఇందులో ఒకేసారి మొత్తంగా చెల్లించడం, నెలలవారీ ఆదాయం చెల్లించడం, లేదా ఒక్కసారిగా మొత్తం, నెలలవారీ ఆదాయం కలిపిన ఎంపికలు ఇలా ఉన్నాయి. ఈ పేమెంట్ ప్లాన్ ను జాగ్రత్తగా ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో మీ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటుంది.

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని అదనపు రైడర్లను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదనపు క్లెయిమ్ ను అందిస్తాయి. ఉదాహరణకు యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడర్(Accidental Disability Rider), క్రిటికల్ ఇల్నెస్ రైడర్(Critical Illness Rider), యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్(Accidental Death Benefit Rider) లాంటి రైడర్లు మీ అవసరాలకు సరిపడే విధంగా ఎంచుకోవడం చాలా అవసరం. చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీని కేవలం క్లెయిమ్ సెటిల్ మెంట రేషియోని చూసి సెలక్ట్ చేసుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. కొన్ని కంపెనీలు చిన్న క్లెయిమ్స్ ను సమర్థంగా పరిష్కరించి మంచి రేషియో చూపిస్తాయి. కానీ పెద్ద క్లెయిమ్స్ ను పరిష్కరించడంలో వారి రికార్డ్ సరైందేమీ ఉండదు. అందువల్ల కంపెనీ సేవలు, కస్టమర్ రివ్యూస్, ఫిర్యాదుల గురించి తెలుసుకోవాలి.

టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సమయంలో ప్రపోజల్ ఫారమ్ ను జాగ్రత్తగా చదవడం, సరిగ్గా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తప్పుగా లేదా జాగ్రత్తగా పూరించని సమాచారంతో ప్రపోజల్ ఫారం పూర్తి చేస్తారు. ఇది భవిష్యత్తులో క్లెయిమ్ ను రిజక్ట్ చేయవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు మీ కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరిచే అవకాశం పొందుతారు. కానీ ఇది నిష్ణాతులుగా సరైన నిర్ణయాలతో మాత్రమే సాధ్యం.


Next Story