- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HDFC యూపీఐ సేవలకు అంతరాయం.. చుక్కలు చూస్తున్న కస్టమర్లు
హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సేవలకు అంతరాయం నెలకొంది. ఉదయం నుండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు పే చేసేటప్పుడు అసలు బ్యాంక్ చూపించడం లేదని ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సేవలకు అంతరాయం నెలకొంది. ఉదయం నుండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు పే చేసేటప్పుడు అసలు బ్యాంక్ చూపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు డబ్బులు కట్ అవుతున్నాయి కానీ పేమెంట్ జరగటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా కొందరు ఏటీఎం విత్ డ్రా కూడా అవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఈ మేరకు కస్టమర్లు ట్విట్లర్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఉదయం 9 అవుతున్నా ఇంకా యూపీఐ సేవలను పునరుద్ధరించలేదని మండిపడుతున్నారు. రోజు రోజుకు హెచ్ డీఎఫ్‌సీ కస్టమర్లను మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ సేవల్లో అంతరాయం కారణంగా నిత్యావసరాలు కొనుగోలు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఈరోజే తమ ఈఎంఐ కట్టాల్సిన రోజు అని కానీ సేవలకు అంతరాయం కలగటం వల్ల కట్టలేకపోతున్నామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు.






