India: మీరు సుంకాలు పెంచుకోండి, మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం

by S Gopi |

అమెరికా ఆర్థిక బెదిరింపులకు దిగుతోందని, భారత ఇంధన నిర్ణయాలపై ఇలాంటి ధోరణికి లొంగేది లేదని ప్రకటించారు.

India: మీరు సుంకాలు పెంచుకోండి, మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ బుధవారం విధించిన అదనపు 25 శాతం సుంకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా కూడా చేరారు. అమెరికా ఆర్థిక బెదిరింపులకు దిగుతోందని, భారత ఇంధన నిర్ణయాలపై ఇలాంటి ధోరణికి లొంగేది లేదని ప్రకటించారు. రాయితీతో కూడిన రష్యా చమురును కొనుగోలు చేయడంపై భారత వైఖరికి మద్దతిస్తూ, వాషింగ్టన్ నిబంధనలుగా పరిగణిస్తున్న ప్రకటనను తిరస్కరించారు. 'మీరు మా ఎగుమతులపై సుంకాలు విధించవచ్చు, కానీ మా సౌర్వభౌమత్వంపై కాదు. ఒత్తిళ్ల కంటే మా దేశ ఇంధన భద్రతను, ఆదేశాల కంటే రాయితీలను ఎంచుకుంటాం. మీరు సుంకాలు పెంచుకోండి, మేము సంకల్పంతో ముందుకెళ్తాం. మెరుగైన ప్రత్యామ్నాయాలను అన్వేషించి, స్వావలంబనను కనుగొంటామే కానీ ఎవరికీ తల వంచేది లేదని ' సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. గోయెంకా పోస్ట్ భారత పరిశ్రమ, రాజకీయ వర్గాలలో పెరుగుతున్న సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపడి ఉన్న జాతీయ భద్రతా చర్యగా ట్రంప్ టారిఫ్ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ, వాణిజ్య చర్చలు విఫలమైన తర్వాత భారత్‌పై ఒత్తిడి చేసే ప్రయత్నంగా విమర్శకులు దీనిని భావిస్తున్నారు.

Next Story