- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chatbots: ఇంటర్నెట్‌లో మనుషులపై చాట్‌బాట్‌ల ఆధిపత్యం
ఇంటర్నెట్ చరిత్రలోనే మొదటిసారిగా వెబ్‌సైట్లను వాడటంలో మనుషులను చాట్‌బాట్‌లు (ఆటోమేటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు) అధిగమించాయన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ చరిత్రలోనే మొదటిసారిగా వెబ్‌సైట్లను వాడటంలో మనుషులను చాట్‌బాట్‌లు (ఆటోమేటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు) అధిగమించాయన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో నడిచే టోటల్ ట్రాఫిక్‌లో ఏకంగా 57.5 శాతం చాట్‌బాట్‌ల నుంచే వస్తుండగా, మనుషుల వాటా కేవలం 42.5 శాతానికే పరిమితమైంది. నిజానికి ఈ మార్పు జరగడానికి ఇంకా సమయం పడుతుందని అంచనా వేశామని, కానీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) రాకెట్ స్పీడ్‌తో దూసుకురావడం వల్లే ఇది ఊహించిన దానికంటే ముందే జరిగిపోయిందని మాథ్యూ ప్రిన్స్ స్పష్టం చేశారు.
ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్న ఈ కొత్త తరం చాట్‌బాట్‌లు.. అచ్చం మనుషుల లాగే వెబ్‌సైట్లలో దూరి రకరకాల పనులను చక్కబెడుతున్నాయి. వివిధ సైట్లలో వస్తువుల రేట్లను పోల్చి చూడటం, తక్కువ ధరలో విమాన టికెట్ల కోసం వెతకడం, ఆన్‌లైన్ షాపింగ్ రీసెర్చ్ చేయడం, అలాగే కస్టమర్ కేర్ పనులను చూసుకోవడం వంటి వందలాది పనులను ఇవి మనుషుల ప్రమేయం లేకుండా క్షణాల్లో చేసేస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ పనుల్లో చాట్‌బాట్‌లదే పైచేయి అయినప్పటికీ.. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలు చూడటం, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేయడం వంటి కంటెంట్‌ను ఎంజాయ్ చేసే విషయాల్లో మాత్రం ఇంకా మనుషుల ఆధిపత్యమే నడుస్తోంది. దేశాల వారీగా చూస్తే.. ఈ రోబోటిక్ (చాట్‌బాట్) ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దేశాల్లో జిబ్రాల్టర్ ఏకంగా 92.1 శాతంతో టాప్‌లో నిలవగా.. సింగపూర్, ఇరాన్ దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.






