Post Office: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్… పోస్ట్ ఆఫీస్ లో 50 లక్షల రూపాయలు లభించే గ్యారెంటీ రిటర్న్ పాలసీ మీకోసం..!!

by Vennela |

Post Office (Endowment Assurance – Santosh Policy): పోస్ట్ ఆఫీస్ వారు అనేక బీమా ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు.

Guaranteed return policy of Rs 50 lakh available at post office telugu news
X

Post Office: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్… పోస్ట్ ఆఫీస్ లో 50 లక్షల రూపాయలు లభించే గ్యారెంటీ రిటర్న్ పాలసీ మీకోసం..!!

దిశ, వెబ్ డెస్క్: Post Office (Endowment Assurance – Santosh Policy): పోస్ట్ ఆఫీస్ వారు అనేక బీమా ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాంటి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోమెంట్ అస్యూరెన్స్ (సంతోష్) బీమా ప్లాన్ (Endowment Assurance – Santosh Policy) ఈ స్కీమ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి, పేద వర్గాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ స్కీంలో జీవిత బీమాతో పాటు పెట్టుబడి రెండు ప్రయోజనాలు లభిస్తాయి. పాలసీదారుడు పాలసీ కాలం పూర్తయ్యే వరకు బతికితే, అతనికి Sum Assured + Bonus లభిస్తుంది. ఒక వేళ పాలసీదారుడికి మరణం సంభవిస్తే నామినీకి ఎంత ఇస్యురెన్స్ ఉంటే అంత లభిస్తుంది. అందుకే ఇది రిటర్న్ గ్యారంటీ ఉన్న ప్లాన్ గా చెప్పవచ్చు.

ఈ పాలసీ ప్రీమియం ముఖ్యంగా 10 నుండి 35 సంవత్సరాల కాల వ్యవధిలో చెల్లించవచ్చు. ఇక ఈ పాలసీకి అర్హత వయసు 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంతో పాటు బీమా మొత్తం 20 వేల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రీమియం ఎంత అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ప్రీమియంను బట్టి మీకు రిటర్న్ లభిస్తుంది.

అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతిఏడాది బోనస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి 1000 రూపాయలకు గాను చెల్లిస్తారు. ఈ ఇన్సూరెన్స్ పైన లోన్ సైతం ఇస్తారు. అయితే మూడు సంవత్సరాల తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రీమియం విషయానికి వస్తే, మీరు ప్రీమియం చెల్లింపు నెలకు ఒక సారి, మూడు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చొప్పున కట్టవచ్చు. సెక్షన్ 80 సి కింద టాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది.

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే, నెలకు సుమారు రూ. 1500 చెల్లించవలసి ఉంటుంది. పాలసీ పూర్తి అయిన తర్వాత రూ. 5 లక్షలు బీమా మొత్తం రూ. 2.5 లక్షల వరకు బోనస్ లభించవచ్చు. ఇది భవిష్యత్తులో రిస్క్ కవరేజ్‌తో పాటు సురక్షిత ఆదాయం అందించే పాలసీ. ప్రభుత్వ భద్రతతో కూడిన ఈ ప్లాన్ ఎక్కువమంది ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

Next Story