PPF Investment: ఇంట్లో నుంచే అకౌంట్ ఓపెన్.. మీ డబ్బులు డబుల్ చేసే బంపర్ ప్లాన్ ఇది

by Vennela |
PPF Investment:  ఇంట్లో నుంచే అకౌంట్ ఓపెన్.. మీ డబ్బులు డబుల్ చేసే బంపర్ ప్లాన్ ఇది
X

దిశ, వెబ్ డెస్క్ : PPF Investment: సేఫ్ అండ్ గ్యారంటీగా రాబడిని అందించే పెట్టుబడి కోసం ఎదురుచూసినట్లయితే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)బెయిస్ ఛాయిస్ అని చెప్పవచ్చు. పీపీఎఫ్(PPF) అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో అకౌంట్ తీసుకోవచ్చు. ఈ రోజు మనం పీపీఎఫ్(PPF) ఖాతాను ఎలా తెరవాలి..దానికి ఎవరు అర్హులు..ఎంత వడ్డీ వస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

పీపీఎఫ్(PPF) అనేది ప్రభుత్వ పొదుపు పథకం. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు మీ పొదుపులను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మంచి వడ్డీ కూడా పొందవచ్చు. దీని అతిపెద్ద లక్షణం ఏంటంటే వచ్చే వడ్డీ, మెచ్చూరిటీ మొత్తం రెండూ టాక్స్ ఫ్రీ. ఈ స్కీములో పెట్టుబడి కాలం 15ఏళ్లు. దీన్ని మీరు మరింత పొడిగించుకోవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే భారతీయ పౌరులై ఉండాలి. పెద్దలు లేదంటే మైనర్లు ఎవరైనా సరే పీపీఎఫ్ ఖాతాను తీసుకోవచ్చు. తల్లిదండ్రులు మైనర్లకు అకౌంట్ తీసుకోవచ్చు. ప్రవాస భారతీయలు పీపీఎఫ్ ఖాతాను తీసుకునేందుకు అనుమతి లేదు. వారు గతంలో అకౌంట్ తీసుకుని ఉంటే దానినే కొనసాగించుకోవచ్చు. కానీ కొత్త అకౌంట్ తీసుకునేందుకు అవకాశం లేదు.

పీపీఎఫ్(PPF) లో ఏడాదికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ.15లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఈ మొత్తాన్ని ఒకేసారి లేదంటే అనే వాయిదాల్లో డిపాజిట్ చేయవచ్చు. మీరు ఏడాదికి రూ. 1.లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లయితే అది కూడా పన్ను మినహాయింపు కిందకు వస్తుంది. మీకు ఆదాయపుపన్ను ఆదా చేయడానికి వీలుంటుంది.

పీపీఎఫ్(PPF) పై వడ్డీరేటును ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి నిర్ణయిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ దాదాపు 7.1శాతం వార్షిక వడ్డీరేటును అందిస్తుంది. దీనిని కాంపౌండింగ్ ఆధారంగా లెక్కిస్తుంటారు. ఈ వడ్డీ ప్రత్యేకత ఏంటేంటే ఇది టాక్స్ ఫ్రీ. ఇది మీకు పూర్తి ప్రయోజనం ఇస్తుంది. మీకు SBI, HDFC, ICICI,లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఏవైనా ప్రధాన ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుల్లో బ్యాంకు అకౌంట్ ఉంటే మీరు ఇంట్లో నుంచే ఈ సౌకర్యాన్ని ఆన్ లైన్లో పీపీఎఫ్ అకౌంట్ ను తీసుకోవచ్చు.

నెట్ బ్యాంకింగ్ లాగిన్ మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్ సైట్ లేదా యాప్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. తర్వాత పీపీఎఫ్ అకౌంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ లేదా సర్వీస్ విభాగానికి వెళ్లి పీపీఎఫ్ అకౌంట్ తెరవడానికి ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అవసరమైన సమాచారాన్ని ఇచ్చి ఇక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, నామినీ సమాచారాన్ని అందించాలి. అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి అవసరమైన గుర్తింపు రుజువులను అప్ లోడ్ చేయాలి. మీ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు కనీసం 500రూపాయలు డిపాజిట్ చేయాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు పీపీఎఫ్ అకౌంట్ వస్తుంది.

Next Story