Nirmala Sitaraman: జీఎస్టీ సంస్కరణలు, ట్రంప్ టారిఫ్‌కు సంబంధం లేదు

by S Gopi |   (  Updated:2025-09-09 17:54:24  IST  )

ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ మినహాయింపు మొదలుకొని జీఎస్టీ శ్లాబుల తగ్గింపు వరకు గడిచిన 18 నెలలుగా చర్చలో ఉన్నాయి.

Nirmala Sitaraman: జీఎస్టీ సంస్కరణలు, ట్రంప్ టారిఫ్‌కు సంబంధం లేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మంగళవారం జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి.. ట్రంప్ టారిఫ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం వెలువడిందనే ఊహాగానాలను కొట్టిపారేశారు. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ మినహాయింపు మొదలుకొని జీఎస్టీ శ్లాబుల తగ్గింపు వరకు గడిచిన 18 నెలలుగా చర్చలో ఉన్నాయి. గతేడాది కేంద్ర బడ్జెట్‌కు ముందు నుంచే ఈ సంస్కరణల రూపకల్పన జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామాన్యులకు ఉపశమనం అందించాలని నాకు గుర్తు చేస్తూనే ఉన్నారని వివరించారు. అమెరికా ఎగుమతి అయ్యే 48 బిలియన్ డాలర్ల నష్టాన్ని భర్తె చేసేందుకే జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఆ రెండింటికి సంబంధం లేదు. సంస్కరణల ప్రతిపాదనల సిద్ధం చేసేందుకు సమయం పట్టింది. ఈ ఏడాది మే నెలలోనే ప్రధాని ఈ విషయంపై సంప్రదించానని చెప్పారు. సంస్కరణల గురించి అంతర్గతంగా చర్చించి, ఆపై జీఎస్టీ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.

Next Story