Mukesh Ambani: జీఎస్టీ 2.0 సంస్కరణలు వినియోగ ఆధారిత వృద్ధికి చోదక శక్తి: ముఖేష్ అంబానీ

by S Gopi |   (  Updated:2025-09-04 17:57:33  IST  )

ఈ చర్యలు వినియోగ ఆధారిత వృద్ధికి చోదక శక్తిగా అభివర్ణించారు.

Mukesh Ambani: జీఎస్టీ 2.0 సంస్కరణలు వినియోగ ఆధారిత వృద్ధికి చోదక శక్తి: ముఖేష్ అంబానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ కౌన్సిల్ తాజా రేట్ల తగ్గింపు ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ప్రకటనలో తెలిపారు. కంపెనీ రిటైల్ విభాగంలోని అన్ని వస్తువులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్ల తగ్గింపును అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకున్న జీఎస్టీ 2.0 సంస్కరణలను ముఖేష్ అంబానీ ప్రశమించారు. ఈ చర్యలు వినియోగ ఆధారిత వృద్ధికి చోదక శక్తిగా అభివర్ణించారు. జీఎస్టీ హేతుబద్దీకరణ వల్ల వినియోగదారులకు ఉత్పత్తులు, సేవలు మరింత సరసమైనవిగా మారుతాయని, వ్యాపారాలకు కూడా నిర్వహణలోని సంక్లిష్టతను తగ్గిస్తాయని అన్నారు. పన్ను తగ్గింపు ఫలితంగా రిటైల్ రంగంలో వినియోగాన్ని పెంచేందుకు ఉత్ప్రేరకంగా ఉంటుందని, ముఖ్యంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేందుకు ఇది కీలకమని అంబానీ తెలిపారు. పన్ను తగ్గింపును వినియోగదారులకు అందించేందుకు రిలయన్స్ రిటైల్ కట్టుబడి ఉందని రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. ఈ సంస్కరణల ప్రయోజనాలను కస్టమర్లకు పారదర్శకంగా, తక్షణం అందేలా చూస్తామని ఆమె పేర్కొన్నారు.

Next Story