UPI Payments : యూపీఐ పేమెంట్స్ పై GST.. కేంద్రం క్లారిటీ

by Muthe.Rajitha |

యూపీఐ పేమెంట్స్(UPI Payments) పన్ను విధించడంపపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

UPI Payments : యూపీఐ పేమెంట్స్ పై GST.. కేంద్రం క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీఐ పేమెంట్స్(UPI Payments) పన్ను విధించడంపపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇకపై యూపీఐ చెల్లింపుల మీద GST విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% GST విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. శుక్రవారం కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా అవన్నీ అవాస్తవాలని, నిరాధార ఆరోపణలు అని కొట్టి పారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని, చిన్న చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్ లు విధించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story