GST: తొమ్మిది నెలల్లో రూ. 1.88 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత

by S Gopi |

72,393 కేసుల్లో జీఎస్టీ ఎగవేత రూ.1.88 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు

GST: తొమ్మిది నెలల్లో రూ. 1.88 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో రూ. 1.88 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత జరిగినట్లు కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారని సోమవారం ఆర్థిక శాఖ లోక్‌సభకు తెలియజేసింది. సమీక్షించిన కాలంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) మోసాలకు సంబంధించిన కేసులతో సహా 72,393 కేసుల్లో జీఎస్టీ ఎగవేత రూ.1.88 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ వ్యవహారంలో 132 అరెస్టులు జరిగాయి. రూ.20,128 కోట్లు రికవరీ చేసినట్టు ఆయన వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20,582 కేసుల్లో రూ. 2.30 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలను సీజీఎస్టీ అధికారులు గుర్తించగా, రూ. 31,758 కోట్లను రికవరీ చేసి 223 మందిని అరెస్ట్ చేశారు. అంతకుముందు 2022-23లో 1.32 లక్షల కోట్లు, 2021-22లో రూ. 73,238 కోట్లను అధికారులు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు 2023, మే నుంచి ఆగష్టు వరకు, 2024లో ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు రెండుసార్లు ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించారు. ఈ కార్యర్కమం ద్వారా రూ. 49,703 కోట్లను రికవరీ చేసి 27 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.

Next Story