- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST Collection: అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను వసూళ్లలో మరోసారి రికార్డులు నమోదయ్యాయి. గత నెలలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా రేట్లను తగ్గించినప్పటికీ, దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కొనుగోళ్లు జోరందుకోవడంతో ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం భారీగా వచ్చింది. శనివారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ. 1,87,346 కోట్ల కంటే ఇది 4.6 శాతం పెరిగింది. సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 375 రకాల ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించింది. దీనివల్ల దసరా, దీపావళి సమయంలో కొనుగోళ్లు పెరిగాయి. గత నెలలో వచ్చిన మొత్తం రూ. 1,95,936 కోట్ల వసూళ్లలో సీజీఎస్టీ రూ. 36,547 కోట్లు ఉండగా, ఎస్‌జీఎస్టీ రూ. 45,134 కోట్లు, ఐజీఎస్టీ రూ. 1,06,443 కోట్లు, సెస్ రూ. 7,812 కోట్లు ఉన్నాయి. ఇందులో సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ వసూళ్లు పెరగ్గా, సెస్ తగ్గింది. సమీక్షించిన నెలలో రూ.1.45 లక్షల కోట్లు దేశీయ వినియోగంపై పన్నుల ద్వారా వచ్చాయి, దిగుమతులపై పన్నుల ద్వారా రూ.50,884 కోట్లు సమకూరాయి. రూ.26,934 కోట్ల జీఎస్టీ రిఫండ్స్ జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు..
అక్టోబర్ జీఎస్టీ వసూళ్లలో తెలంగాన గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాది కంటే 10 శాతం ఎక్కువగా రూ. 5,726 కోట్ల వసూళ్లు చూసింది. ఇక, ఆంధ్రప్రదే విషయానికి వస్తే 9 శాతం క్షీణత కనిపించింది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.3,815 కోట్లు వసూలు కాగా.. ఈసారి రూ.3,490 కోట్లు వచ్చినట్టు గణాంకాలు వెల్లడించాయి.






