GST Collection: మరోసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

by S Gopi |   (  Updated:2025-06-01 13:01:03  IST  )

అంతకుముందు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో రూ. 2.37 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.

GST Collection: మరోసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ ఆదాయం 16.4 శాతం పెరిగి రూ.2.01 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు ఆదివారం ప్రకటనలో వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.72 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో రూ. 2.37 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. గత నెలలో దిగుమతి వస్తువుల నుంచి వసూలు చేసిన జీఎస్టీ 25.2 శాతం పెరిగింది. దేశీయ ఆర్థిక కార్యకలాపాల నుంచి వచ్చిన మొత్తం 13.7 శాతం వృద్ధి చెందాయి. దిగుమతుల నుంచి స్థూల జీఎస్టీ ఆదాయం రూ.51,266 కోట్లుగా ఉండగా, దేశీయ కార్యకలాపాల నుంచి రూ.1,49,785 కోట్లు వచ్చాయి. గత నెలలో సీ్‌జీఎస్టీ రూ.35,434 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.43,902 కోట్లు, ఐజీఎస్టీ దాదాపు రూ.1.09 లక్షల కోట్లు, సెస్ నుండి వచ్చే ఆదాయం రూ.12,879 కోట్లు వచ్చాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలు 17-25 శాతం వరకు వసూళ్లలో పెరుగుదలను సాధించాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 6 శాతం మేర అధిక వసూళను నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story