Green card: మీ గ్రీన్‌ కార్డును ట్రంప్‌ లాగేసుకుంటాడా? ఇండియన్స్‌ను టెన్షన్ పెడుతున్న మిస్టర్ ప్రెసిడెంట్!

by Vennela |

Green card: అమెరికాలో గ్రీన్ కార్డు(Green card) కలిగిన భారతీయులు కొన్ని పాలసీల వల్ల భయపడుతున్నారు.

Green card: మీ గ్రీన్‌ కార్డును ట్రంప్‌ లాగేసుకుంటాడా? ఇండియన్స్‌ను టెన్షన్ పెడుతున్న మిస్టర్ ప్రెసిడెంట్!
X

దిశ, వెబ్ డెస్క్: Green card: అమెరికాలో గ్రీన్ కార్డు(Green card) కలిగిన భారతీయులు కొన్ని పాలసీల వల్ల భయపడుతున్నారు. ఇంతకీ మీ గ్రీన్‌ కార్డు(Green card) నిజంగానే పోతుందా? ట్రంప్‌(Trump)కు అంత రైట్‌ ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం!

అమెరికాలో నివసించే భారతీయుల్లో కొందరు తమ గ్రీన్ కార్డు(Green card) భద్రతపై అనిశ్చితిలో ఉన్నారు. గతంలో ట్రంప్(Trump) పాలనలో తీసుకున్న కొన్ని పాలసీలు, ముఖ్యంగా "పబ్లిక్ చార్జ్" నిబంధన, గ్రీన్ కార్డు (Green card)కలిగినవారిని కూడా ఆందోళనలోకి నెట్టాయి. ఈ నియమం కొత్త వలసదారులకు మేలు చేసే అవకాశాలను కుదించడానికి తీసుకువచ్చినప్పటికీ, అది ఇప్పటికే గ్రీన్ కార్డు (Green card)కలిగిన వారిపై కూడా ప్రభావం చూపుతుందేమోనని భయం పెరిగింది. ప్రభుత్వ సహాయాన్ని గతంలో పొందిన వారు తమ స్థితిని కోల్పోతారేమోనని ఆందోళన చెందారు.

అలాగే, ట్రంప్(donald trump) ప్రభుత్వ హయాంలో వలసదారులపై మరింత కఠినంగా చర్యలు తీసుకోవడం వల్ల, గతంలో చిన్న తప్పిదాలు చేసిన గ్రీన్ కార్డు (Green card)హోల్డర్ల భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది. ప్రత్యేకంగా, కొన్ని దేశాలకు విధించిన ప్రయాణ నిషేధం కారణంగా, విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావచ్చా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి, గ్రీన్ కార్డు(Green card) అంటే అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కును కలిగిస్తుందే తప్ప, అది ఎప్పటికీ మారనిది కాదు. నేరచర్యలు, వలసచట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదా అమెరికాలో నివాసాన్ని త్యజించడం వంటి సందర్భాల్లో గ్రీన్ కార్డు(Green card)ను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది న్యాయ ప్రక్రియలోనే జరుగుతుంది. అంతేకానీ ఏ ఒక్కరు కూడా ఒకరి గ్రీన్ కార్డును ఒక్క రోజులోనే రద్దు చేయలేరు.

ఇక మీకు ఎవరికైనా తమ గ్రీన్ కార్డు(Green card) భద్రతపై సందేహాలు ఉంటే, మంచి ఇమ్మిగ్రెంట్‌ లాయర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన వారు, చట్టాలను పాటిస్తే వారి గ్రీన్ కార్డు సాధారణంగా సురక్షితమే.

ఇక అమెరికాలో భారతీయ వలసదారులు గ్రీన్ కార్డు(Green card)ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో, 49,700 భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు, ఇది మొత్తం పౌరసత్వం పొందిన వారి 6.1శాతాన్ని సూచిస్తుంది. అయితే, ప్రస్తుతం 1.1 మిలియన్లకు పైగా భారతీయులు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల(Green card) కోసం నిరీక్షణలో ఉన్నారు. ఈ నిరీక్షణ కాలం కారణంగా, భారతీయ వలసదారులు, వారి కుటుంబాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డు(Green card) పొందడం ఆలస్యమవడం వల్ల, వారు ఉద్యోగ భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, కుటుంబ సమగ్రతపై ప్రభావితమవుతున్నారు. ఈ పరిస్థితులు అమెరికాలో భారతీయ వలసదారుల భవిష్యత్తుపై అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.


Next Story