- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GitHub Copilotలోకి GPT-5.4: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు సరికొత్త AI పవర్!
GitHub Copilotలో సరికొత్త GPT-5.4 మోడల్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇది 10 లక్షల టోకెన్ల కాంటెక్ట్స్ విండో, అద్భుతమైన ఏజెంటిక్ సామర్థ్యాలతో సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోడింగ్ వేగాన్న పెంచనుంది.

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, GitHub తన ‘కాపిలట్’ సర్వీస్‌లో సరికొత్త GPT-5.4 మోడల్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. మార్చి 5న వెలువడిన ఈ అప్‌డేట్, ప్రోగ్రామింగ్ ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలవనుంది. పాత మోడల్స్ (GPT-5.3-Codex)తో పోలిస్తే, GPT-5.4 కోడింగ్ పనులను మరింత వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయనుంది. క్లిష్టమైన లాజిక్‌లను కూడా ఇది సులభంగా అర్థం చేసుకోగలదు. ఈ కొత్త మోడల్ ఒకేసారి దాదాపు 10 లక్షల టోకెన్ల సమాచారాన్ని విశ్లేషిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పెద్ద ప్రాజెక్టులు, వేల లైన్ల కోడ్ ఉన్న ఫైళ్లను కూడా క్షణాల్లో పరిశీలించి చక్కని సలహాలు ఇవ్వనుంది.
అదేవిధంగా GPT-5.4 మోడల్ కేవలం కోడ్ రాయడమే కాకుండా, రాసిన కోడ్‌ను పరీక్షించడం (Testing), తప్పులను సరిదిద్దడం (Debugging) వంటి పనులను ఇది స్వయంగా చేయనుంది. ఈ మోడల్‌కు ఆగస్టు 2025 వరకు ఉన్న టెక్నాలజీ అప్‌డేట్స్‌పై పూర్తి అవగాహన ఉంది. వీఎస్ కోడ్ (VS Code), విజువల్ స్టూడియో (Visual Studio), జెట్ బ్రెయిన్స్ (Jet Brains’ వంటి ఐడీఈలలోనూ నేరుగా GPT-5.4ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్ ఉన్నవారు తమ అడ్మిన్ సెట్టింగ్స్ ద్వారా దీనిని డైరెక్ట్‌గా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓపెన్ ఏఐ (Open AI)తో GPT-5.4 మోడల్, కేవలం కోడింగ్‌కే పరిమితం కాకుండా టెక్నికల్ డాక్యుమెంటేషన్, ఆర్కిటెక్చర్ డిజైన్ వంటి పనుల్లో కూడా డెవలపర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది.






