- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Price Data: ద్రవ్యోల్బణ డేటా కోసం ఈ-కామర్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వివరాల సేకరణ
ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఈ-కామర్స్ సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) డేటా విశ్వసనీయత, ఖచ్చితత్వం, నాణ్యతను మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను కూడా సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ధరలతో పాటు, రిటైల్ స్టోర్ల నుంచి ధరల సమాచారం చేర్చడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కింపును మెరుగుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ(మోస్పీ) ద్రవ్యోల్బణం (సీపీఐ), పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ), దేశ స్థూల జాతియోత్పత్తి (జీడీపీ) లను లెక్కించడానికి ఉపయోగించే బేస్ సంవత్సరాలను కూడా మార్చాలని భావిస్తోంది. 2024ని బేస్ ఇయర్‌గా ఉన్న కొత్త ద్రవ్యోల్బణ సూచీ 2026, ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. అయితే సవరించిన సంవత్సరాల ఆధారంగా కొత్త జీడీపీ, పారిశ్రామిక డేటా 2026 తరువాత విడుదల అవుతాయి. మెరుగైన డేటా కోసం ప్రభుత్వం విమాన టిక్కెట్లు, మొబైల్ సేవలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వంటి వాటి కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల నుంచి, ఇంధన ధరలు, రైల్వే ఛార్జీలు, పోస్టల్ ఛార్జీల కోసం ప్రభుత్వ విభాగాల నుంచి ధరలను సేకరిస్తుంది. 12 పెద్ద నగరాల్లో ఆన్‌లైన్ ధరల డేటాను సేకరించనుండగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వివరాలు సేకరిస్తారు.






