- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vehicle: అన్ని బస్సులు, ట్రక్కుల్లో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్ తప్పనిసరి
ఈ నిబంధనలు 2026, ఏప్రిల్ నుంచి తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: బస్సులు, ట్రక్కులతో పాటు ఎనిమిది కంటే ఎక్కువ మంది ప్రయాణించే అన్ని కొత్త ప్యాసింజర్ వాహన మోడళ్లలో భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా వాహనాల్లో అధునాతన ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్స్(ఏఈబీఎస్), డ్రైవర్ డ్రౌజీనెస్ అండ్ అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్స్(డీడీఏడబ్ల్యూఎస్), లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్స్(ఎల్‌డీడబ్ల్యూఎస్) ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రోడ్డు రవానా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిబంధనలు 2026, ఏప్రిల్ నుంచి అమల్లోకి తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) తప్పనిసరి చేయడానికి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది. ఈ నిబంధనలు డ్రైవర్లకు వార్నింగ్ ఇవ్వడం, సకాలంలో డ్రైవర్ స్పందించడంలో విఫలమైతే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో తీసుకొచ్చారు. నిర్దిష్ట గడువు తర్వాత ఉత్పత్తి చేసిన ట్రక్కులతో పాటు మినీ, సాధారణ బస్సులు రెండూ తప్పనిసరిగా ఏఈబీఎస్, వెహికల్ స్టెబిలిటీ ఫంక్షన్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఏఈబీఎస్ ముందుగానే ప్రమాదాలను గుర్తిస్తుంది. డ్రైవర్ వెంటనే స్పందించకపోతే, వాహన వేగాన్ని తగ్గించడానికి, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి బ్రేక్‌లను వేస్తుంది. ఎల్‌డీడబ్ల్యూఎస్ కూడా వాహనం అనుకోకుండా లేన్ బయటకు వెళ్లినపుడు డ్రైవర్‌లకు వార్నింగ్ ఇస్తుంది. డీడీఏడబ్ల్యూఎస్ స్టీరింగ్ మూవ్‌మెంట్, లేన్ పొజిషన్, ఫేస్ ట్రాకింగ్ ఆధారంగా డ్రైవర్ అలర్ట్‌గా ఉన్నాడా లేడా అనేది పర్యవేక్షిస్తుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఆడియో వార్నింగ్ ఇస్తుంది.






