Retail Inflation: ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించాలని ఆర్‌బీఐని కోరిన ప్రభుత్వం

by S Gopi |

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే ఉండేలా చూడాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)ని కేంద్రం కోరింది.

Retail Inflation: ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించాలని ఆర్‌బీఐని కోరిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో ఐదేళ్ల పాటు దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే ఉండేలా చూడాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)ని కేంద్రం కోరింది. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు 2026, ఏప్రిల్ 1 నుంచి 2031, మార్చితో ముగిసే వచ్చే ఐదేళ్ల కాలనికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యం పరిధిలో కొనసాగించాలని బుధవారం ఆర్థిక వ్యవహారాల శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ప్రభుత్వం యథాతథంగా కొనసాగించడం ఇది మూడవసారి. ఇదివరకు 2016, 2021లో ఇదే తరహా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దేశించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతంగా, దీనికి గరిష్ట స్థాయి 6 శాతంగానూ, కనిష్ట స్థాయి 2 శాతంగానూ నిర్ణయించింది. ఇటీవల గణాంకాల ప్రకారం, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.21 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే.

Next Story