Nitin Gadkari: త్వరలో ఈ-రిక్షాలకూ భారత్ ఎన్‌క్యాప్ తరహా భద్రతా ప్రమాణాలు

by S Gopi |

భారత్ ఎన్‌క్యాప్ తరహాలో ఈ-రిక్షాలకు కూడా భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నట్టు గడ్కరీ తెలిపారు.

Nitin Gadkari: త్వరలో ఈ-రిక్షాలకూ భారత్ ఎన్‌క్యాప్ తరహా భద్రతా ప్రమాణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రోడ్డు భద్రతను పెంచడానికి భవిష్యత్తులో భారత్ ఎన్‌క్యాప్ తరహాలో ఈ-రిక్షాలకు కూడా భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నట్టు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. గురువారం జరిగిన 7వ ఎడిషన్ ఫిక్కీ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. రోడ్డు భద్రతను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ఏటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటే, 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో 66.4 శాతం మంది 18-45 ఏళ్ల వయసు ఉన్నవారే. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచే క్రమంలో ఈ-రిక్షాలకు కూడా భారత్ ఎన్‌క్యాప్ లాంటి ప్రమాణాలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దీన్ని ఎలా నిర్వహించాలనే దానిపై సమీక్ష జరుపుతున్నట్టు గడ్కరీ వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి దాదాపు 3 శాతం నష్టం వాటిల్లుతోంది, హెల్మెట్లు వాడకపోవడం వల్ల 30 వేల మరణాలు, సీట్ బెల్ట్ పెట్టుకోక 16 వేల మరణాలు సంభవిస్తున్నాయి. వీటి నివారణ కోసం ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు.

Next Story