- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పేస్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత సరళీకృతం!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృష్టి సారించనుంది

న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పేస్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకృతం చేయవచ్చని ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం స్పేస్ రంగంలో ఎఫ్‌డీఐలు ప్రభుత్వ మార్గంలో మాత్రమే శాటిలైట్-ఎస్టాబ్లిష్‌మెంట్, కార్యకలాపాల్లో 100 శాతం వరకు అనుమతించబడుతున్నాయి.
శుక్రవారం గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి రాజేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం దేశీయ స్పేస్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను పరిశీలిస్తోంది. ఇప్పటికే కొన్ని వ్యూహాత్మక రంగాలు మినహా ఇతర వాటిలో ఎఫ్‌డీఐ నిబంధనలు సరళీకరించబడ్డాయి. ఆర్థిక వ్యవస్థలో దాదాపు అన్ని రంగాలకు సులభతర విధానాలను కొనసాగించేందుకు ప్రయత్నించాం. అయితే, మరింత సరళీకరణ అవసరం. రానున్న రోజుల్లో స్పేస్ రంగంలోనూ దీన్ని విస్తరించవచ్చని రాజేష్ కుమార్ పేర్కొన్నారు.






