- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడి కాదు.. గుడ్డే కొండెక్కుతోంది.. : ఒక్కో కోడిగుడ్డు రూ.10!
వీకెండ్ వస్తే.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ షాపులకు క్యూ కడతారు. వీకెండ్లోనే వాటి రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్ వస్తే.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ షాపులకు క్యూ కడతారు. వీకెండ్లోనే వాటి రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ప్రతీవారం రేట్లు పెరుగుతూ పోతే.. కొండెక్కిన కోడి, షాకిచ్చిన చికెన్ అనే వార్తలు చదువుతుంటాం. కానీ ఈసారి కోడి కాదు.. గుడ్డే షాకిస్తోంది. రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ మొదటివారంలో అదే కోడిగుడ్డు ధర రూ.6కి.. జూన్ చివరి వారానికి వచ్చేసరికి రూ.8కి చేరింది. త్వరలోనే రూ.10కి కూడా చేరి.. కొనుగోలుదారులకు షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. సామాన్యుడిపైనే ఈ భారం ఎక్కువగా ఉండనుంది. కోడిగుడ్డు ధర ఇంతలా పెరగడానికి కారణాలేంటి? పిల్లల నుంచి పెద్దల వరకూ పౌష్టిక ఆహారంగా ప్రతిరోజూ తినే కోడిగుడ్డే రూ.10 అయితే ఇంకేం కొనాలి? ఏం తినాలి? అని వినియోగదారులు వాపోతున్నారు.
తెలంగాణలో సుమారు 4 వేల పౌల్ట్రీ లేయర్ పరిశ్రమలు ఉంటే.. రోజుకు సుమారు 4 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుంటే.. రాష్ట్రంలో 50 శాతం, ఇతర రాష్ట్రాలకు 50 శాతం ఎగుమతి అవుతుంటాయి. అయితే ఈ ఏడాది వేసవిలో తీవ్రమైన ఎండలు భరించలేక.. 10 శాతం కోళ్లు చనిపోయాయి. దాంతో గుడ్ల ప్రొడక్షన్ తగ్గి.. డిమాండ్ కి తగిన సప్లై లేక ధర పెరిగింది. అంతే కాదు.. కోళ్ల మేత, మెడిసిన్ ధరలు కూడా పెరగడంతో.. ఆ ప్రభావం గుడ్డురేటుపై కూడా పడింది. దీనిపై నేషనల్ ఉత్తర తెలంగాణ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. ఎగ్ రైతుకు కోడిగుడ్డు రూ.6 పడితే.. రిటైల్ మార్కెట్ కు వచ్చేసరికి రూ.8 పలుకుతోందన్నారు. మొన్నటి వరకూ పశ్చిమాసియా యుద్ధం కారణంగా కోడిగుడ్ల ఎగుమతి లేక నష్టపోయామన్నారు. ఒక కోడి గుడ్డు పెట్టేందుకు పెట్టే మేత, మెడిసిన్ కే తమకు రూ.7 పడుతోందన్నారు. మొన్నటి వరకూ పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారని, గుడ్డు ధర పెరగడం వల్ల ఆ నష్టాల నుంచి రైతులు బయటపడతారని అభిప్రాయపడుతున్నారు. రైతులు నష్టపోవడం వల్ల వినియోగదారులపై ఆ భారం పడకతప్పడం లేదన్నారు.






