- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIM-Binding: సిమ్ బైండింగ్ గడువును పొడిగించే యోచనలో కేంద్రం
ప్రధానంగా కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, ఈ మేరకు గడువు పెంపునకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం ప్రభుత్వం వాట్సాప్, అరట్టై, టెలిగ్రాం లాంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు తప్పనిసరి సిమ్ బైండింగ్ గడువును పొడిగించే అవకాశం ఉంది. ఈ నిబంధనను పాటించడానికి కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) ఈ ఏడాది డిసెంబర్ వరకు గడువు ఇవ్వాలని అధికారులు వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్రధానంగా కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, ఈ మేరకు గడువు పెంపునకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 2025, నవంబర్‌లో కేంద్రం ఈ నిబంధనలు ప్రకటించింది. వీటి అమలు కోసం కంపెనీలకు మూడు నెలలు(90 రోజుల) గడువు ఇచ్చింది. అయితే, ఈ నిబంధనలు అమలులో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, టెస్టింగ్, ఓఎస్ అప్‌డేట్ లాంటి సవాళ్లు ఉన్నాయని కంపెనీలు స్పష్టం చేశాయి. వీటిని పరిష్కరించి నిబంధనల అమలుకు ఇంకా సమయం కావాలని కేంద్రానికి వివరించాయి. సిమ్ బైండింగ్ అనేది సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్, టెలిగ్రాం లాంటి యాప్స్ మొబైల్‌ఫోన్లలో పని చేసే విధానం. అంటే యూజర్ తాను వాడే ఫోన్‌లో రిజిస్టర్ చేసిన సిమ్ కార్డు ఉంటేనే ఆయా యాప్‌ల అకౌంట్లను యాక్సెస్ చేసే వీలుంటుంది.
మరోవైపు, దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలకు చెక్ పెడుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,962 స్కైప్ ఐడీలను, 83,867 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసింది. అలాగే, మొబైల్, నెట్‌వర్క్ భద్రతను పెంచుతూ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) వ్యవస్థ ద్వారా గుర్తించిన 8.45 లక్షల సిమ్ కార్డులను, 2.39 లక్షల మొబైల్ ఐఎంఈఐ నంబర్లను అధికారులు బ్లాక్ చేశారు.






