- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unemployment Data: ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటాను విడుదల చేయనున్న ప్రభుత్వం
ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసిక పరంగా ఈ డేటాను విడుదల చేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెల నుంచి నెలవారీ నిరుద్యోగిత డేటా విడుదల చేయనున్నట్టు గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి సోమవారం ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలోని నిరుద్యోగ సమస్యను సూచించే కీలక గణాంకాలు ఇకపై నెల నెలా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసిక పరంగా ఈ డేటాను విడుదల చేస్తోంది. మే 15వ తేదీ నుంచి నెలవారీగా దీన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మే 15న డేటా విడుదల చేయనుండగా, ఆ తర్వాత ప్రతి నెలా డేటా విడుదలవుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి నెలా నిరుద్యోగానికి సంబంధించి డేటా అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విడుదల చేస్తుంటాయి. మన దేశంలో మాత్రం త్రైమాసిక డేటాను ప్రకటిస్తోంది. అంతేకాకుండా ఆ డేటాలో అర్బన్ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ వివరాలు మాత్రమే ఉంటాయి. ఏడాదికి ఒకసారి కేంద్ర అధికారికంగా ప్రకటించే డేటాలో పట్టణ, గ్రామీణ ప్రాంత డేటా ఉంటుంది. దీన్ని ఇకపై నెల నెల ప్రకటించనున్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ డేటా మాత్రం మూడు నెలలకు ఒకసారి వెలువరించనున్నారు.






