- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Small Savings Schemes: ఈసారి కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీలో మార్పు లేదు
ఇప్పుడున్న రేట్లనే కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమయ్యే వరుసగా ఆరవ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్ల గురించి ప్రకటన విడుదల చేసింది. సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌సీసీ, పీపీఎఫ్ వంటి పథకాలపై వడ్డీ రేట్లను యథావిధిగా, ఇప్పుడున్న రేట్లనే కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రస్తుత రేట్లు కొనసాగిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును తగ్గించడంతో పాటు బాండ్లపై రాబడి తగ్గడంతో చిన్న మొత్తాల పొదుపు పథకలాపై వడ్డీ రేట్లను తగ్గిస్తానే ఊహాగానాలు వినిపించాయి. అయితే, పొదుపు పథకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తగ్గింపునకు మొగ్గు చూపలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, వడ్డీ రేట్లు.. సుకన్య సమృద్ధి యోజన పథకానికి అధికంగా 8.2 శాతం, ఎన్‌సీసీ పథకానికి 7.7 శాతం, పీపీఎఫ్‌కు 7.1 శాతం, మూడేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లకు కూడా ఇదే వడ్డీ 7.1 శాతం కొనసాగుతుంది. కాగా, చివరిసారిగా ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సవరించింది.






