- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petroleum : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ రూ.2 సుంకం పెంపు.. రిటైల్ ధరల్లో మార్పు లేదు
ప్రజలు కొనే రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పూ ఉండదని ఆ తర్వాతి ప్రకటనలో స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: చమురు ధరలకు సంబంధించి కేంద్రం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌లపై లీటర్‌కు రూ. 2 మేర ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకోగా, ఏప్రిల్ 8(మంగళవారం) నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రజలు కొనే రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పూ ఉండదని ఆ తర్వాతి ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులపై తాజా పెంపు వల్ల ఎటువంటి భారం ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(రెసిప్రోకల్ టారిఫ్) కారణంగా అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. దానివల్ల గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు గణనీయంగా క్షీణించాయి. గ్లోబల్ క్రూడ్ ధరలు 2021, ఏప్రిల్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. సోమవారం సాయంత్రానికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 63 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో తాజా ఎక్సైజ్ పెంపును తమ లాభాల్లో సర్దుబాటు చేస్తాయని కేంద్రం వివరించింది.
Read More..






