శుభవార్త: తగ్గనున్న వంటనూనె ధరలు.. ఎంతంటే!

by Disha Web Desk 17 |
శుభవార్త: తగ్గనున్న వంటనూనె ధరలు.. ఎంతంటే!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గనున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ధరలు దిగిరావడంతో దేశీయంగా కూడా వినియోగదారులకు ఆ ప్రయోజనాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం వంటనూనె బ్రాండ్ కంపెనీలను కోరింది. కంపెనీలు తమ ఉత్పత్తులపై గరిష్ట రిటైల్ ధరలను(ఎంఆర్‌పీ) లీటర్‌కు రూ. 8-12 తగ్గించాలని ఆహార, ప్రజా పంపిణీ శాఖ(డీఎఫ్‌పీడీ) సూచించింది. ఈ మేరకు శుక్రవారం పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో ధరలు తగ్గించాలని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్నారు.

రెండేళ్ల క్రితం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ఇన్‌పుట్, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. 2022, జూన్ నుంచి ధరలు దిగి రావడంతో దేశీయంగా వంటనూనె ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తగినట్టుగా దేశీయంగా ధరలు తగ్గట్లేదని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో తక్షణం ధరలు తగ్గించాలని తెలిపింది. గత నెల వంటనూనె అసోసియేషన్‌లతో జరిగిన సమావేశంలో కంపెనీలు పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్ నూనెలపై లీటర్‌కు రూ. 5-15 తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

రూ. 3 వేలకే వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్‌కు బెస్ట్ చాయిస్


Next Story

Most Viewed