- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IRDAI: ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ సేథ్ నియామకం
ఈ ఏడాది మార్చిలో దెబాసిష్ పాండా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) కొత్త ఛైర్మన్‌గా అజయ్ సేథ్న్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో దెబాసిష్ పాండా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అజయ్ సేథ్ గతంలో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. మార్చిలోనే తుహిన్ కాంత పాండే సెబీకి చైర్‌పర్సన్‌గా మారిన తర్వాత, అప్పటి ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) కార్యదర్శిగా ఉన్న అజయ్ సేథ్‌కు ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శిగా అదనపు బాధ్యతను అప్పగించింది. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా అజయ్ సేథ్, నాలుగేళ్ల పాటు కేంద్ర ఆర్థిక సేవల విభాగంలో విధులు నిర్వహించారు. జూన్‌లో పదవీ విరమణ చేశారు. ఆర్థిక వృద్ధి, ఆర్థిక నిర్వహణ, మౌలిక సదుపాయాల నిధులు, డిజిటల్ చెల్లింపుల పాలసీల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన కెరీర్‌లో ఎక్కువ భాగం పబ్లిక్ ఫైనాన్స్, పన్ను విధానం, ప్రజా వ్యయం, బడ్జెటింగ్, విదేశీ పెట్టుబడులు, ప్రాజెక్ట్ అప్రైసల్, డెవలప్‌మెంట్ ఫైనాన్సింగ్, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలపై దృష్టి సారించారు. ఆయన సామాజిక పరిపాలన, పాఠశాల విద్య, ఆరోగ్యం, పట్టణ రవాణా, మౌలిక సదుపాయాలలో కూడా పనిచేశారు.






