Induction Cooktop: ఇండక్షన్ కుక్‌టాప్ ఉత్పత్తి పెంచేందుకు పరిశ్రమలతో ప్రభుత్వం చర్చలు

by S Gopi |

గ్యాస్‌ సరఫరా ఒత్తిడిని తగ్గించడానికి విద్యుత్ ఆధారిత వంటకు మారేలా రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్‌లు, క్యాటరింగ్ వ్యాపార వర్గాలతో పాటు పెద్ద పెద్ద కిచెన్ నిర్వహాకులను ప్రోత్సహిస్తోంది.

Induction Cooktop: ఇండక్షన్ కుక్‌టాప్ ఉత్పత్తి పెంచేందుకు పరిశ్రమలతో ప్రభుత్వం చర్చలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇండక్షన్ కుక్‌టాప్‌లు, అందుకు అవసరమైన పాత్రల సరఫరాను పెంచడానికి పరిశ్రమలతో చర్చలు జరుపుతోంది. ఇదే సమయంలో, గ్యాస్‌ సరఫరా ఒత్తిడిని తగ్గించడానికి విద్యుత్ ఆధారిత వంటకు మారేలా రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్‌లు, క్యాటరింగ్ వ్యాపార వర్గాలతో పాటు పెద్ద పెద్ద కిచెన్ నిర్వహాకులను ప్రోత్సహిస్తోంది. పెరిగిన కుక్‌టాప్‌ల డిమాండ్ తీర్చడానికి, దిగుమతులను కూడా పెంచాలని భావిస్తోంది. అధిక డిమాండ్‌ను తీర్చడానికి, కుక్‌టాప్‌లను దిగుమతి చేసుకుంటూనే, దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి శనివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, డీపీఐఐటీ కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా, విద్యుత్ కార్యదర్శి పంకజ్ అగర్వాల్, డీజీఎఫ్‌టీ లవ్ అగర్వాల్ చర్చించి, పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశీయ తయారీదారులకు ప్రయోజనం అందించేలా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను వాయిదా వేయడం వంటి కొన్ని నిబంధనలను ప్రభుత్వం తాత్కాలికంగా సడలించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముడిసరుకులపై తక్కువ దిగుమతి సుంకాలు, జీఎస్టీ తగ్గింపులను పరిశ్రమ వర్గాలు అభ్యర్థించాయి.

Next Story