SEBI Chairperson: SEBI కొత్త చీఫ్ కోసం ప్రభుత్వం ప్రకటన..మూడేండ్లకే సెబీ చైర్‌పర్సన్‌ పదవీ కాలం ముగుస్తుందా..?

by Vennela |

వెబ్ డెస్క్: SEBI Chairperson: ప్రస్తుత సెబీ చైర్ పర్సన్( SEBI Chairperson) మాధాబీ పురి బుచ్ (Madhabi Buch Puri)పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది.

SEBI Chairperson: SEBI కొత్త చీఫ్ కోసం ప్రభుత్వం ప్రకటన..మూడేండ్లకే  సెబీ చైర్‌పర్సన్‌ పదవీ కాలం ముగుస్తుందా..?
X

దిశ, వెబ్ డెస్క్: SEBI Chairperson: ప్రస్తుత సెబీ చైర్ పర్సన్( SEBI Chairperson) మాధాబీ పురి బుచ్ (Madhabi Buch Puri)పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త వ్యక్తి నియామకానికి ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఆహ్వానించింది. ఈ పదవికి ఎంపికైనవారు 5ఏళ్లపాటు కొనసాగుతారు.

దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత సెబీ చైర్ పర్సన్( SEBI Chairperson) మాధాబీ పురి బుచ్ (Madhabi Buch Puri)పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఆమె పదవీ కాలానికి నెల రోజుల ముందే కేంద్రం కొత్త సెబీ చైర్ పర్సన్ నియామానికి దరఖాస్తులు ఆహ్వానించింది. మాధాబీ పురి బుచ్ పరస్పర ప్రయోజనాల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

అయితే సెబీ చైర్ పర్సన్( SEBI Chairperson) పదవి కోసం ఆసక్తి గల వారు వచ్చే నెల ఫిబ్రవరి 17వ తేదీలోకా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో తెలిపింది. 50ఏళ్ల పై బడినవారు 25ఏళ్లపాటు వ్రుత్తి నైపుణ్యం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులని పేర్కొంది. స్టాక్ మార్కెట్లో(stock market) తలెత్తే సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉండాలని పేర్కొంది. న్యాయ, ఫైనాన్స్, ఆర్థిక , అకౌంటెన్సీలో ప్రత్యేక నాలెడ్జ్ ఉండాలి. సెబీ చైర్ పర్సన్ పదవికి ఇబ్బంది కలిగించే విధంగా ఆర్థిక, ఇతర ప్రయోజనాలు పొందుతూ ఉండరాదని కేంద్రం తెలిపింది.

కాగా ఈ పదవికి ఎంపికైన వారు 5ఏళ్లపాటు లేదా వారికి 65ఏళ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగుతారని కేంద్రం వివరించింది. అయితే 2022లో సెబీ చైర్ పర్సన్( SEBI Chairperson) గా నియమితులైన మాధాబీ బుచ్(Madhabi Buch Puri) పదవీ కాలం 3ఏళ్లకే ముగిసిపోతోంది. అదానీ గ్రూప్(Adani Group) తో ఆమెకు సంబంధం ఉందని అమెరికా షార్ట్ సెల్లార్ హిండెన్ బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) గతేడాది ఆరోపణలు చేసింది. హిండెన్ బర్గ్(Hindenburg Research) ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్ గా రాజీనామా చేయాలని మాధాబీ బుచ్ పురి(Madhabi Buch Puri)ని కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె వ్యవహార శైలికి వ్యతిరేకంగా గత ఏడాది సెబీ ఉద్యోగులు ఆందోళన బాట కూడా పట్టారు. ఈనేపథ్యంలో ఇప్పుడు సెబీ చైర్ పర్సన్ కు దరఖాస్తు కోరడం గమనార్హం.

Next Story