- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E25: ఈ25పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఈ25పై పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని, తుది నివేదికలు వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: త్వరలో మార్కెట్లోకి ఈ25 పెట్రోల్ రాబోతోందంటూ వస్తున్న నివేదికలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ప్రస్తుతం ఈ25 పెట్రోల్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని, దీనిపై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశాయి. ఈ25పై పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని, తుది నివేదికలు వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. కాబట్టి ఈ25 త్వరలో అందుబాటులోకి వస్తుందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు కొట్టిపారేశారు. అదే సమయంలో, ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ20 ఇథనాల్ పెట్రోల్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండున్నరేళ్లుగా విస్తృత పరీక్షలు, సాంకేతిక ధ్రువీకరణ తర్వాతే ఈ20ని దశలవారీగా అమలు చేశామని, ఈ ప్రక్రియలో ఆటోమొబైల్ తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సాంకేతిక నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. భవిష్యత్తులో ఇథనాల్ శాతాన్ని పెంచాలా లేదా అన్న నిర్ణయం కూడా పూర్తిగా వాహన భద్రత, ఇంజిన్ పనితీరు, దీర్ఘకాలిక మన్నికకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, దేశంలో ఇప్పటికే సుమారు 20 కోట్ల పెట్రోల్ ద్విచక్ర వాహనాలు, 20 లక్షల పెట్రోల్ కార్లు ఇథనాల్ పెట్రోల్‌ను వినియోగిస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమం విస్తరించడం దాని ఆమోదయోగ్యతకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఈ25పై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






