Google: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్ ఇవే

by S Gopi |

వాటిలో స్పోర్ట్స్ మొదలుకొని రాజకీయాలు, సినిమాల వరకు అనేక అంశాలు ఉన్నాయి.

Google: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్ ఇవే
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరికొన్ని రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. భారత లోక్‌సభ ఎన్నికలతో పాటు అనేక అంశాలు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం గూగుల్ 2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్ వివరాలను తాజాగా వెల్లడించింది. వాటిలో స్పోర్ట్స్ మొదలుకొని రాజకీయాలు, సినిమాల వరకు అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా దేశంలో మతంలా భావించే క్రికెట్‌కు చెందిన రెండు అంశాలు టాప్ 2లో నిలవడం విశేషం. ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్ తమకు నచ్చిన టీమ్స్, క్రికెటర్లు, వేలంపాట గురించి తెలుసుకునేందుకు వెతకడంతో ఐపీఎల్ గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో స్కోర్, అప్‌డేట్స్ కోసం టీ20 వరల్డ్ కప్ గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. వీటి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి గెలిచేందుకు లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంది. దీంతో పార్టీ విధానాలు, నేతలు, ఎన్నికల వ్యూహం, ఎన్నికల ర్యాలీ కోసం బీజేపీ పార్టీ గురించి ఎక్కువమంది గూగుల్‌లో వెతికారు. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి కూడా భారతీయులు ఎక్కువగా గూగుల్‌లో వెతికారు. టాప్5లో ఈ ఏడాది ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వేసవిలో ఎండవేడిమి నుంచి భద్రత వంటి అంశాల కోసం హీట్‌వేవ్ అనే పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు. అనంతరం రతన్ టాటా, కాంగ్రెస్, ప్రో కబడ్డి, ఇండియన్ సూపర్‌లీగ్ వంటి అంశాలు టాప్-10లో ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో స్త్రీ2 మూవీతో పాటు కల్కీ 2898 క్రీ. శ, 12 ఫెయిల్, లాపతా లేడీస్, హనుమాన్‌తో పాటు ఆరెంజ్ పీల్ థియరీ, జెన్ జీ బాస్ మీమ్స్ వంటి మీమ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

Next Story