- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: వచ్చే ఏడాది మొదటి ఏఐ గ్లాసెస్‌ను విడుదల చేయనున్న గూగుల్
కంపెనీ శాంసంగ్, జెంటిల్ మాన్‌స్టర్‌లతో కలిసి, వార్బీ పార్కర్ల భాగస్వామ్యంతో రెండు రకాల గ్లాసెస్‌ను అభివృద్ధి చేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే ఏడాదిలో తన మొదటి ఏఐ-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. కంపెనీ ప్రధానంగా శాంసంగ్, జెంటిల్ మాన్‌స్టర్‌లతో కలిసి, వార్బీ పార్కర్ల భాగస్వామ్యంతో రెండు రకాల గ్లాసెస్‌ను అభివృద్ధి చేస్తోంది. జెమిని ఏఐ అసిస్టెంట్‌ని ఉపయోగించి స్క్రీన్-ఫ్రీ ద్వారా ఆడియో-ఓన్లీ ఏఐ గ్లాసెస్‌తో పాటు నావిగేషన్, ట్రాన్స్‌లేషన్, ఇతర ప్రైవేట్ సమాచారాన్ని చూపించే ఇన్-లెన్స్ స్క్రీన్‌తో డిస్ప్లే-ఎనేబుల్డ్ ఏఐ గ్లాసెస్ తీసుకొచ్చేందుకు గూగుల్ పనిచేస్తోంది. ఇదివరకు గూగుల్ 2012లో స్మార్ట్‌గ్లాసెస్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఏఐ టెక్నాలజీ, ఇతర హార్డ్‌వేర్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ఆ ప్రయత్నాలను వదిలిపెట్టింది. అయితే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ మెరుగ్గా ఉండటంతో ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్‌పై కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందిస్తోంది. అది గతం కంటే మరింత ఆచరణాత్మక, ఏఐ ఫీచర్స్‌తో తీసుకురానున్నట్టు గూగుల్ తెలిపింది. మరోవైపు, గూగుల్‌కు మెటా-రేబాన్‌కు చెందిన స్మార్ట్ గ్లాసెస్, స్నాప్, ఆలీబాబా, యాపిల్‌ల నుంచి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మరింత సమర్థవంతంగా ఏఆర్, ఏఐ ఉత్పత్తులపై కృషి చేస్తోంది. గూగుల్ ఇప్పటికే రూపొందించిన ప్రోటోటైప్‌లలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ మీట్ లాంటి యాప్‌ల కోసం ఏఆర్ ఓవర్‌లేతో ఉన్న మోనోక్యులర్, బైనాక్యులర్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లకు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడం ద్వారా తేలికగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.






