Google: త్వరలో పర్సనల్ కంప్యూటర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌

by S Gopi |

గతంలో కంప్యూటర్లలో క్రోమ్ ఓఎస్‌ను ప్రారంభించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.

Google: త్వరలో పర్సనల్ కంప్యూటర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి గూగుల్ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మొబైళ్లకే పరిమితమైన ఆండ్రాయిస్ ఓఎస్‌ను భవిష్యత్తులో పర్సనల్ కంప్యూటర్లలోనూ తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఓఎస్ చిన్న పరికరాలకే పరిమితం అయింది. గతంలో కంప్యూటర్లలో క్రోమ్ ఓఎస్‌ను ప్రారంభించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దీంతో ఇప్పటికీ పర్సనల్ కంప్యూటర్ విభాగంలో యాపిల్ మ్యాక్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్‌లదే ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, పీసీల మార్కెట్లో గూగుల్ మరోసారి ఆండ్రాయిడ్ ఓఎస్‌ను తీసుకురావాలని భావిస్తోంది. దీనికోసం ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్‌ను విలీనం చేసేందుకు సిద్ధమైంది.

తాజాగా హవాయి కేంద్రంగా జరిగిన స్నాప్ డ్రాగన్ సమ్మిట్‌లో గూగుల్ ప్రతినిధి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వేర్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఉన్నాయి. ఈ రెండింటిని విలీనం చేస్తామని, పీసీలకు ఆండ్రాయిడ్ ఏఐ, జెమిని ఏఐ ఫీచర్లు యాడ్ చేయనున్నాం. మా అప్లికేషన్‌లు, డెవలపర్ కమ్యూనిటీలన్నింటినీ పీసీ డొమైన్‌లోకి తీసుకురావడంపై కలిసి చేస్తున్నాం. కంప్యూటర్ విభాగంలో అందరికీ ఆండ్రాయిడ్ సేవలందించేందుకు ఇదొక మార్గమని భావిస్తున్నట్టు గూగుల్ ప్రతినిధి ఓస్టర్‌లోహ్ వివరించారు. కాగా, ఎంట్రీ లెవల్ కంప్యూటర్లలో మెరుగైన సేవల కొసం క్రోమ్ ఓఎస్‌ను గూగుల్ అందిస్తోంది. కానీ, అది పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంతో ప్రస్తుతం పీసీ మార్కెట్లో క్రోమ్ ఓఎస్ వాటా 7 శాతం వద్దే ఉంది. విండోస్ ఇప్పటికీ దాదాపు 80 శాతం వాటాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

Next Story