Google Pay: బిల్లుల చెల్లింపులపై ఫీజు వసూలు చేస్తున్న గూగుల్‌పే

by S Gopi |

విద్యుత్, గ్యాస్ వంటి సేవల కోసం వినియోగదారులు కొంత రుసుము చెల్లించక తప్పదు.

Google Pay:  బిల్లుల చెల్లింపులపై ఫీజు వసూలు చేస్తున్న గూగుల్‌పే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫామ్‌ గూగుల్‌పే బిల్లుల చెల్లింపులపై ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో బిల్లు చెల్లింపులపై కన్వినియన్స్ రుసుమును వసూలు చేస్తోంది. దీంతో ఇకపై విద్యుత్, గ్యాస్ వంటి సేవల కోసం వినియోగదారులు కొంత రుసుము చెల్లించక తప్పదు. అయితే, యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించడంలేదు. ఇప్పటికే ఫోన్‌పె, పేటీఎం వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు పలు లావాదేవీలపై ఫీజును వసూలు చేస్తున్నాయి. గూగుల్‌పే వెబ్‌సైట్ ప్రకారం, గూగుల్‌పే మొబైల్ రీఛార్జీలపై గతేడాది నుంచే రూ. 3 కన్వినియన్స్ ఫీజును వసూలు చేస్తోంది. తాజాగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెలించే విద్యుత్, గ్యాస్ వంటి బిల్లుల చెల్లింపులపై లావాదేవీ విలువలో 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఛార్జీలను విధిస్తోంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం యూపీఐ మార్కెట్‌లో 37 శాతంతో గూగుల్‌పే గణనీయమైన వాటాను కలిగి ఉంది. గత నెలలో రూ. 8.26 లక్షల కోట్ల విలువైన లావాదేవీలను ప్రాసెస్ చేసింది.

Next Story