- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: భారత్‌లో రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్న గూగుల్
ఇప్పటివరకు అమెరికా వెలుపల గూగుల్‌కు రిటైల్ స్టోర్లు లేవు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ కంపెనీ భారత్‌లో రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కంపెనీకి అమెరికాలో ఐదు ఫిజికల్ రిటైల్ స్టోర్లు ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు అమెరికా వెలుపల గూగుల్‌కు రిటైల్ స్టోర్లు లేవు. భారత్‌ను కీలక మార్కెట్‌గా చూస్తున్న కంపెనీ, ఇప్పటికే దేశంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా బయట మొదటి స్టోర్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ స్టోర్‌లలో కంపెనీ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వాచ్, ఇయర్‌బడ్ వంటి ఉత్పత్తులను విక్రయించనుంది. స్టోర్ ఏర్పాటు కోసం దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తోంది. దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ అధికారికం కానందున స్పష్టమైన వివరాలు తెలియవని, కనీసం ఆరు నెలల సమయం పట్టొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరున్న దక్షిణాదిలోని బెంగళూరులో మొదటి స్టోర్ ఏర్పాటును కంపెనీ పరిశీలించినప్పటికీ ఢిల్లీ, ముంబై తొలి ప్రాధాన్యతగా పరిగణిస్తున్నట్టు సమాచారం.






