- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: ఉచితంగా 'అడోబ్ ఫోటోషాప్' సబ్‌స్క్రిప్షన్
గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా లభిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

దిశ, బిజినెస్ బ్యూరో: అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కస్టమర్లకు ఇమేజ్-ఏడిటింగ్ సాఫ్ట్‌వేర్ అడోబ్ ఫోటోషాప్ ప్రీమియం వెబ్ వెర్షన్‌ను పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. భారత్‌తో పాటు అనేక దేశాల్లో సైలెంట్‌గా అందుబాటులోకి తెచ్చిన ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ 2026, చివరి వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందిస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా లభిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఉపయోగించడానికి గూగుల్ క్రోమ్‌లో ఫోటోషాప్ ఎక్స్‌టెన్షన్‌ను యాడ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఫోటోషాప్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ సెర్చ్ చేస్తే లభిస్తుంది. డిసెంబర్ 8లోపు చేసుకున్న వారికి 12 నెలల పాటు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. రానున్న రోజుల్లో కొత్త ఫీచర్లు కూడా యాడ్ చేస్తామని అడోబ్ తెలిపింది. ఆన్‌లైన్‌లోనే ఇమేజ్ ఎడిటింగ్ అవసరమైన వారికి ఇది పనికొస్తుంది. ఈ ఎక్స్‌టెన్షన్ క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనదేశంలో అడోబ్ ఫోటోషాప్ కోసం నెలకు సుమారు రూ. 1,999 ధర ఉంటుంది.






