గూగుల్‌లో మరోసారి తొలగింపులు.. సుందర్ పిచాయ్ సంకేతాలు!

by Dishafeatures2 |
గూగుల్‌లో మరోసారి తొలగింపులు..  సుందర్ పిచాయ్ సంకేతాలు!
X

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, మాంద్యం వంటి పరిస్థితుల మధ్య ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే 12 వేల కంటే ఎక్కువమందిని ఇంటికి పంపింది. తాజాగా, పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్న నేపథ్యంలో మరిన్ని తొలగింపులు ఉంటాయని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో చెప్పారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్, గూగుల్ డాక్స్, జీమెయిల్‌లను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానివల్ల సంస్థ సామర్థ్యం మరింత పెరగనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ టెక్నాలజీల్లో మరింత పనిచేయాల్సి ఉందని, దానికు అనుగుణంగా ఉద్యోగులను ఆయా సంబంధిత ప్రాజెక్టులకు పంపుతున్నట్టు సుందర్ పిచాయ్ వివరించారు. ఈ క్రమంలోనే ఖర్చులను పునఃసమీక్షిస్తూ సంస్థ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచే దిశగా చర్చిస్తున్నట్టు వెల్లడించారు. సుందర్ పిచాయ్ వ్యాఖ్యల ఆధారంగా గూగుల్ త్వరలో మరో భారీ లేఆఫ్ ప్రకటన ఉండనున్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో గూగుల్ సంస్థ 12 వేల మందిని తొలగించింది. వీరిలో 450 మంది దేశీయంగా పనిచేస్తున్నవారు ఉన్నారు.

Also Read...

గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పెరిగిన భారత ఎగుమతులు! 504


Next Story

Most Viewed