బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్.. వెల్లడించిన బ్లూమ్ బర్గ్

by Naga Rani Yarlagadda |

ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) బిలియనీర్ క్లబ్ లోకి చేరి కీలక మైలురాయిని అధిగమించారు.

బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్.. వెల్లడించిన బ్లూమ్ బర్గ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) బిలియనీర్ క్లబ్ లోకి చేరి కీలక మైలురాయిని అధిగమించారు. పదేళ్లుగా ఆల్ఫాబెట్ (Alphabet)కు సీఈఓగా ఉంటోన్న ఆయన తాజాగా బిలియనీర్స్ క్లబ్ లోకి అడుగుపెట్టినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) వెల్లడించింది. ప్రస్తుతం ఆయన నికర సందప 1.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.

కాగా.. బిలియనీర్ క్లబ్ లోకి అడుగుపెట్టడానికి కొద్ది గంటల ముందే సుందర్ పిచాయ్ గూగుల్ ఏఐ (Google AI) గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 980 ట్రిలియన్ టోకెన్లను గూగుల్ ఏఐ ప్రాసెస్ చేస్తోందని తెలిపారు. ఇక గూగుల్ జెమినీ యూజర్ల సంఖ్య 450 మిలియన్లకు చేరిందన్నారు. రోజువారీ జెమినీ యూజర్ల సంఖ్య.. ఫస్ట్ క్వార్టర్ తో పోలిస్తే 60 శాతం పెరిగిందన్నారు. గూగుల్ మీట్ లోనూ ఏఐ వినియోగం పెరిగిందని, ఒక్క జూన్ నెలలోనే ఏఐ నోట్స్ ను 50 మిలియన్ల మంది వినియోగించారని వివరించారు.

గూగుల్ ఏఐ వీడియో క్రియేషన్ (Google AI Video Creation) టూల్ కు సైతం క్రమంగా డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం మంత్లీ యూజర్ల సంఖ్య 1 మిలియన్ గా ఉందన్నారు. యూట్యూబ్ లో షార్ట్స్ హవా కొనసాగుతోందని, ఏఐ వీడియోలకు రోజుకు వచ్చే సగటు వ్యూస్ 200 బిలియన్లు దాటినట్లు తెలిపారు.

Next Story