Gold Prices(20-04-2026):అక్షయ తృతీయ వేళ మహిళలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-20 05:38:46  IST  )

మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుందనే విషయం తెలిసిందే.

Gold Prices(20-04-2026):అక్షయ తృతీయ వేళ మహిళలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం దేశంలో అక్షయ తృతీయ కొనుగోళ్లతో జువెలరీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు దిగిరావడం గమనార్హం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు(సోమవారం) తగ్గాయి. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ధరలు తగ్గడం మహిళలకు శుభవార్త అనే చెప్పవచ్చు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 450 మేర తగ్గి రూ. 1,42,350 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 490 మేర తగ్గి రూ. 1,55,290 గా ఉంది. ఈరోజు వెండి ధరల్లో ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 2,80,000 ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,42,350

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,55,290

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,42,350

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,55,290

Next Story