- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. కాస్త ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు గోల్డ్ ధరలు కాస్త తగ్గి ఊరటనిచ్చాయి. దీంతో గోల్డ్ కొనడానికి ప్రజలు బంగారం షాపులకు పరుగులు పెడుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ.87,550 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు తగ్గి రూ.95,510 గా ఉంది. ఇక వెండి ధరలు 100 తగ్గి కిలో రూ. 1,09,900గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,550
24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,510
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,550
24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,510






