Gold Prices Today: మహిళలకు మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతుందంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-10-21 04:49:00  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Gold Prices Today: మహిళలకు మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.

మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో ఇప్పుడిప్పుడు హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేడు(అక్టోబర్ 21) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,30,690 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.2,080 పెరిగి రూ. 1,32,770గా ఉంది. అలాగే, నిన్న రూ.1,19,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,900 పెరిగి రూ.1,21,700 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.2000 తగ్గి కిలో రూ. 1,88,000గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,21,700

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,32,770

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,21,700

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,32,770

Next Story